Skip to content

‘వదలా’ జూలై 17న థియేటర్లలో రిలీజ్

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు సస్పెన్స్, మిస్టరీ, బలమైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’లో ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లయ, హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే ‘ఫస్ట్ గ్లింప్స్’తో ఆసక్తిని రేకెత్తించగా, టీజర్ అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆకట్టుకునే కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. విడుదల తేదీ పోస్టర్ సినిమా మిస్టీరియస్ వాతావరణాన్ని ఆసక్తికరంగా ప్రతిబింబిస్తోంది. రెడ్ బ్యాక్ డ్రాప్ లో హృతికా శ్రీనివాస్ లోలోపల ఎన్నో రహస్యాలు దాచుకున్నట్లుగా కనిపించే ఎక్స్‌ప్రెషన్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆమెకు ఇరువైపులా జగపతి బాబు, లయ తీవ్రమైన భావోద్వేగాలతో కనిపిస్తూ, ఈ ముగ్గురు పాత్రల మధ్య ఉన్న బంధం ఏమిటనే ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

విడుదల తేదీ ఖరారైన నేపథ్యంలో రానున్న రోజుల్లో సినిమా ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచనున్నారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కార్తీక్ కొడకండ్ల సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, లక్ష్మీ భూపాల కథా రచయితగా, బజ్జా బ్రహ్మయ్య ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ
రచయిత: లక్ష్మీ భూపాల
నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ
DOP: చోటా కె నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
ఆర్ట్ డైరెక్టర్: బజ్జా బ్రమయ్య
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణాచారి ఎర్రోజు, వీరు గడ్డం
ప్రొడక్షన్ కంట్రోలర్: బొడ్డు సత్యనారాయణ
పబ్లిసిటీ డిజైన్: కృష్ణా డిజిటల్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.