రాష్ట్రపతిని కలిసిన రోజారమణి, చక్రపాణి
సీనియర్ నటి రోజారమణి, ఆమె భర్త చక్రపాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి నిలయం వేదికగా ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని సీనియర్ నటి రోజారమణి, ఆమె భర్త, ప్రముఖ నటుడు చక్రపాణి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ వార్షిక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ వేడుకకు సినీ పరిశ్రమ నుండి రోజారమణి - చక్రపాణి దంపతులకు ఆహ్వానం అందింది. బాలనటిగా 'భక్త ప్రహ్లాద' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రోజారమణి, నటుడిగా చక్రపాణి భారత రాష్ట్రపతిని కలవడం తమ జీవితంలో ఒక మరపురాని క్షణం అని…
