Skip to content

“బేబి” మూవీ టీమ్ ను అభినందించిన కస్తూరి

“బేబి” మూవీ టీమ్ ను అభినందించిన కస్తూరి Telugu News

71వ జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న “బేబి” సినిమా టీమ్ ను అభినందించింది నటి కస్తూరి. ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా బేబి టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది నటి కస్తూరి. ఆమె స్పందిస్తూ – బేబి సినిమా ఒక గేమ్ ఛేంజర్. నేను నా టీనేజ్ అబ్బాయి, అమ్మాయితో కలిసి ఈ సినిమా చూశాను. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు మా మధ్య బేబి సినిమా గురించి చర్చ జరిగింది. అని ట్వీట్ చేసింది.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.