మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’: కె. ఎస్ రామారావు
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కేఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు. విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది. విడుదల…
