Skip to content

‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా 'కొత్త లోక 1: చంద్ర' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతదేశపు మార్గదర్శక సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం భారతీయ సంస్కృతి, జానపదాలు మరియు పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క…

Read more

దుల్కర్ సల్మాన్ #DQ41 ప్రారంభం

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ఎప్పుడూ యూనిక్ కథలు, చాలెంజింగ్ రోల్స్ తో అలరిస్తున్నారు. తన 41వ చిత్రం #DQ41 కోసం దుల్కర్, నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. #SLV10 మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ఈ రోజు హైదరాబాద్లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య…

Read more

‘కాంత’ గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ కాంత ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాతలు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు, ఈ టీజర్ ప్రాజెక్ట్ పై అంచనాలను మరింత పెంచింది వెర్సటైల్ యాక్టర్ చంద్రన్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య…

Read more

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ గ్లింప్స్ విడుదల

దుల్కర్ సల్మాన్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బహుభాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్. ఎన్నో వైవిధ్యమైన, సరికొత్త పాత్రలతో ఆయన మెప్పిస్తున్నారు. ఈ విలక్షణత కారణంగానే ఆయన చేస్తున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటివే అందుకు ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ…

Read more