‘ఈషా’ బ్లాక్‌బస్టర్ విజయం క్రెడిట్ ప్రేక్షకులదే..కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ఫ్రూవ్ చేశారు: వంశీ నందిపాటి
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'ఈషా'అనే హారర్ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రం ఈ క్రిస్మస్ విజేతగా నిలిచింది. అఖిల్‌రాజ్ త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈనేపథ్యంలో చిత్ర టీమ్ బ్లాక్‌బస్టర్…
