పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో తెరపై అగ్ని తుఫాను సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' ట్రైలర్ విడుదలైంది. విడుదలైన తక్షణమే ఈ ట్రైలర్, సామాజిక మాధ్యమాల్లో అగ్రి తుఫాను సృషిస్తోంది. సినిమా యొక్క స్థాయిని, శక్తివంతమైన కథని, గొప్ప విజువల్స్‌ను ప్రదర్శిస్తూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'ఓజీ' ఎందుకు ప్రశంసించబడుతుందో ట్రైలర్ పునరుద్ఘాటిస్తుంది. 'ఓజీ' గర్జనకు మూలం పవన్ కళ్యాణ్. ఆయన ఓజాస్ గంభీరగా ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో తిరిగి వచ్చి.. మరెవరికి సాధ్యంకాని వింటేజ్ స్టైల్, ఆరాతో కట్టిపడేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇంతటి శక్తివంతమైన పాత్రలో…
