Skip to content

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల Telugu News

ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో తెరపై అగ్ని తుఫాను సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ ట్రైలర్ విడుదలైంది. విడుదలైన తక్షణమే ఈ ట్రైలర్, సామాజిక మాధ్యమాల్లో అగ్రి తుఫాను సృషిస్తోంది. సినిమా యొక్క స్థాయిని, శక్తివంతమైన కథని, గొప్ప విజువల్స్‌ను ప్రదర్శిస్తూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా ‘ఓజీ’ ఎందుకు ప్రశంసించబడుతుందో ట్రైలర్ పునరుద్ఘాటిస్తుంది.

‘ఓజీ’ గర్జనకు మూలం పవన్ కళ్యాణ్. ఆయన ఓజాస్ గంభీరగా ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో తిరిగి వచ్చి.. మరెవరికి సాధ్యంకాని వింటేజ్ స్టైల్, ఆరాతో కట్టిపడేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇంతటి శక్తివంతమైన పాత్రలో చూసి చాలా కాలం అయిందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరే స్థాయిలో ఉందని అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు సుజీత్ ఈ ట్రైలర్‌ను భారీ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా మరియు స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఓ విందు భోజనంలా మలిచారు. ట్రైలర్ అభిమానుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకొని వెళ్తుంది. ‘ఓజీ’ ట్రైలర్ పవన్ కళ్యాణ్ పాత్ర వెనకున్న రహస్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా, పవన్ కళ్యాణ్-ఇమ్రాన్ హష్మీ పాత్రల మధ్య జరిగే ఘోరమైన ముఖాముఖి పోరాటం పట్ల కూడా ఆసక్తి కలిగేలా చేసింది. వెండితెరపై ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణను ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఉత్సుకతను కలిగిస్తూ ట్రైలర్ ను గొప్పగా రూపొందించారు.

ఛాయాగ్రాహకులు రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస కట్టిపడేసే విజువల్స్, నవీన్ నూలి పదునైన ఎడిటింగ్, తమన్ ఎస్ రోమాలు నిక్కబొడిచే నేపథ్య సంగీతంతో.. ‘ఓజీ’ ట్రైలర్ మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతంలా ఉంది.

ఇప్పటికే ‘ఓజీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ‘ఓజీ’ పేరు మారుమోగిపోతోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ రాకతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. సామాజిక మాధ్యమాలన్నీ ‘ఓజీ’ ట్రైలర్ వేడుకలతో నిండిపోయాయి. అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అంచనా వేస్తున్నాయి.

దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా మలిచారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సంవత్సరపు గొప్ప సినీ వేడుకగా ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

తనని ‘ఓజీ’ అని ఎందుకు పిలుస్తారో.. తాజాగా విడుదలైన ట్రైలర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. త్వరలోనే బాక్సాఫీస్ వద్ద ‘ఓజీ’ రూపంలో పవర్ స్టార్ తుఫాను చూడబోతున్నాం.

తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.