పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ, ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న…
