అర్జున్ దాస్ ద్విభాషాచిత్రంగా రాబోతోన్న ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ విడుదల
అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కె.ఎస్. సినిష్ 'సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' బ్యానర్‌పై సమర్పిస్తుండగా 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ‘సూపర్ హీరో బాబు’ రాబోతోంది. 'బెలూన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కె.ఎస్. సినిష్ ‘డిక్కిలూనా’, ‘పార్కింగ్’తో నిర్మాతగానూ మంచి పేరు సంపాదించుకున్నారు. నిర్మాతగా సినిష్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కంటెంట్ ఉన్న కథతో 'సూపర్ హీరో'ని నిర్మించారు. అర్జున్ దాస్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓజీతో అందరినీ ఆకట్టుకున్నారు…
