Skip to content

బాక్సాఫీస్ నిజమైన ‘ఓజీ’ తిరిగి వచ్చాడు

బాక్సాఫీస్ నిజమైన ‘ఓజీ’ తిరిగి వచ్చాడు Telugu News

ఇంకా ట్రైలర్‌ కూడా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం ‘ఓజీ’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది.

పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఓజీ’ తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు.

ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మూడు వారాల ముందే.. ఓజీగా ఆయన బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు.

ఆకలితో ఉన్న చిరుతపులిలా, పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రికార్డులను వేటాడుతున్నారు. ఓజీ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఓజీ’ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, మైలురాయి చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి అద్భుతమైన తారాగణం ఉన్నారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

‘ఓజీ’ అనే శక్తివంతమైన టైటిల్ కి తగ్గట్టుగానే.. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ తుఫాను సృష్టిస్తున్నారు. త్వరలోనే ఈ తుఫాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.