ప్రైమ్ వీడియోలో రాబోతున్న మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’
కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' అనే వెబ్ సిరీస్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘జగమే సంగీతం’ గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఎన్నో విశేషాల్ని పంచుకన్నారు. ఈ మేరకు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ .. ‘నా దృష్టిలో కుటుంబం, ఆ కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. పాత్రల మధ్య సంబంధాలు, సంఘర్షణలు, ఆశయాలు ఆవిష్కృతమయ్యేందుకు సంగీతం ఒక మాధ్యమంగా (భాషగా) పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం, దానిపై అవగాహన…
