‘టాక్సిక్ ’ నుంచి హుమా ఖురేషి ఫస్ట్ లుక్ రిలీజ్
- టాక్సిక్ సినిమాతో చేయబోతున్న ప్రయోగం, సాహసం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన బాలీవుడ్ నటి రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హుమా ఖురేషి..టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. ఆమె పాత్రలో మిస్టరీ, ఇంటెన్సిటీ అర్థమవుతోంది. 2026లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై లేటెస్ట్‌గా హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌తో బజ్ మరింత పెరిగింది…
