“భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది – రజనీకాంత్
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమాగా నిర్మిస్తున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా…
