Skip to content

“రాజా సాబ్” నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి 'రాజే యువరాజే..' పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ విశెస్ చెప్పడం యాప్ట్ గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి…

Read more

“శంబాల” మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ తో నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేసిన నిర్మాత రాజేష్ దండ

హీరో ఆది సాయికుమార్ నటించిన "శంబాల" మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆది సాయికుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్య మూవీస్ బ్యానర్ లో ఆది సాయికుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలో ప్రొడ్యూసర్ రాజేష్ దండా వెల్లడించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో హాస్య మూవీస్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం హీరోగా "కె ర్యాంప్" మూవీని నిర్మించి ఘన విజయాన్ని దక్కించుకుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్…

Read more

3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 2.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి”

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన "గుర్రం పాపిరెడ్డి" సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. డార్క్ కామెడీ మూవీ జానర్ లో సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందీ మూవీ. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లో 2.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఇలాగే పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో…

Read more

ఘనంగా విజయ్ దేవరకొండ “రౌడీ జనార్థన” టైటిల్ గ్లింప్స్ రిలీజ్- దిల్ రాజు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ మాట్లాడుతూ - డైరెక్టర్ రవికిరణ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్…

Read more

“వృష‌భ‌” ప్రీ రిలీజ్ ఈవెంట్ – ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ "వృష‌భ‌". ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది. "వృష‌భ‌" చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న "వృష‌భ‌" సినిమాను దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో…

Read more

“శంబాల” మూవీ టీమ్ కు కాన్ఫిడెన్స్ ఇస్తూ, బెస్ట్ విశెస్ అందించిన కిరణ్ అబ్బవరం

ఆదిసాయికుమార్ హీరోగా నటించిన శంబాల సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తోంది. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన స్పీచ్ శంబాల టీమ్ లో మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. ఆది ఫాదర్ సాయికుమార్ తో తనకున్న అనుబంధాన్ని ఈ వేదిక మీద గుర్తుచేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - శంబాల మూవీ గురించి ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా చెబుతున్నారు. ఆది అన్నకు ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలి. నాకు ఇండస్ట్రీలో తెలిసిన పెద్ద హీరో సాయికుమార్ గారే. ఆయన నా ఎస్ ఆర్ కల్యాణమండపం…

Read more

‘4 మోర్ షాట్స్ ప్లీజ్’ లాంటి సక్సెస్ అందుకుంటున్న ‘త్రీ రోజెస్ 2’

ఈషా రెబ్బా, సత్య, రాశీ సింగ్, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ "త్రీ రోజెస్" సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ గర్ల్స్ గ్యాంగ్ హంగామా చూపిస్తూ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన "4 మోర్ షాట్స్ ప్లీజ్" లాంటి సక్సెస్ అందుకుంటోంది. సంప్రదాయాలను మించిన స్వేచ్ఛను, ఎవరి విమర్శలను పట్టించుకోని స్నేహం, తమదైన ఆశయంతో ముందుకు సాగే ముగ్గురు అమ్మాయిలుగా ఈషా, రాశీ, కుషిత తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండీ లైఫ్ లో లవ్, కెరీర్, పర్సనల్ స్పేస్ ను కోరుకునే నవతరం…

Read more

జనవరి 1న “వానర” సినిమా

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన "వానర" సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "వానర" సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. టీజర్ కు 2 మిలియన్…

Read more

హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ భారీ పాన్ ఇండియా మూవీ “SVC59” నుంచి డైరెక్టర్స్ నోట్ ప్రోమో రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ SVC59. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ నెల 22న సాయంత్రం 7.29 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తన మదిలో రూపుదిద్దుకున్న హీరో పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ రవికిరణ్ కోలా. 'ఒక మనిషి గురించి ఎప్పటినుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా, నా జ్ఞాపకాల్లో అతను…

Read more

ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీగా “గుర్రం పాపిరెడ్డి” ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది – హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. - "గుర్రం పాపిరెడ్డి" సినిమాలో నేను సౌధామిని అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సౌధామిని నర్సుగా పనిచేస్తుంటుంది. డాక్టర్ చదువుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో గుర్రం పాపిరెడ్డి పరిచయమై…

Read more