మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్
శ్రీ లక్ష్మీ ఆర్ట్స్, మీడియా 9 క్రియేషన్స్ బ్యానర్ పై నేతి శ్యామ్ సుందర్ నిర్మాతగా మనోజ్ కుమార్ కటోకర్ దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫిలిం మిస్టర్ రోమియో. ఏ రీల్ లైఫ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ తో రూపొందించారు. గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఎస్ కే ఖాదర్, నవనీత్ బన్సాలి, కుల్దీప్ రాజ్ పురోహిత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్య గరికిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. గురువారం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరోయిన్ శ్రియా శరణ్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్…