రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల
ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది. జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు…
