రాయలసీమ భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్
భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. ఈ మూవీలో రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆల్రెడీ హీరో భరత్ జనాల్లోకి వెళ్లి సినిమాను డిఫరెంట్గా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్లను రిలీజ్ చేశారు. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇందుకోసం రిలీజ్ చేసిన…
