Skip to content

రాయలసీమ భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్

రాయలసీమ భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్ Telugu News
రాయలసీమ భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్ Telugu News

భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. ఈ మూవీలో రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆల్రెడీ హీరో భరత్ జనాల్లోకి వెళ్లి సినిమాను డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌లను రిలీజ్ చేశారు. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇందుకోసం రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తుంటే యాక్షన్, లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సినిమా రానుందని అర్థం అవుతోంది.

పోస్టర్లలో హీరో లుక్, రక్తంతో నిండిన ఆ తీరు చూస్తుంటే యాక్షన్ పాళ్లు ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది. ఇక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకు షేక్ వలి, క్రాంతి కుమార్ కెమెరామెన్స్‌గా, శేఖర్ మోపూరి సంగీత దర్శకుడిగా పని చేశారు.

నటీనటులు: రాయలసీమ భరత్, నిత్యశ్రీ, ప్రీతి, సారా, అజయ్, బాహుబలి ప్రభాకర్, సత్యప్రకాష్, సమ్మెటగాంధీ, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, అంబటిశ్రీనివాస్, ఎఫ్. ఎం బాబాయ్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : పీలం పురుషోత్తం
దర్శకుడు : భరత్‌, సంతోష్
సంగీతం : శేఖర్ మోపూరి
డీఓపీ :షేక్ వలి, క్రాంతి కుమార్
పీఆర్వో : సాయి సతీష్

See also  'సింగ్ గీతం'లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. - హీరోయిన్ శాలిని కొండెపుడి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.