Skip to content

‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ విడుదల

‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్  విడుదల Telugu News
‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ విడుదల Telugu News
‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ విడుదల Telugu News
‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ విడుదల Telugu News

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నవదీప్ పల్లపొలి, సాయి దుర్గ తేజ్ సారథ్యంలో శ్రీకాంత్ మన్నెపురి ‘డిస్కవర్ ఆంధ్ర’ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌ని పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ లాంఛ్‌ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘శ్రీకాంత్ కోసం ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆంధ్రను ఇంత అద్భుతంగా చూపిస్తున్న శ్రీకాంత్ గారికి థాంక్స్. మన చుట్టూనే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని అందరూ ఆశ్చర్యపోతారు. 2020లో నాకు ఈ వైల్డ్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చాయి. అందుకే ‘గ్రీన్ పాస్’ అనే ఎన్జీవోని నా స్నేహితుడితో కలిసి ప్రారంభించాను. బీచ్ క్లీన్ చేయడం, కోస్టల్ ఏరియాలోని జీవుల్ని, పక్షుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఈ వైల్డ్ లైఫ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ‘రిపబ్లిక్’ చిత్రంలోనూ పర్యావరణం గురించి, దాన్ని కాపాడుకునే విషయాల గురించి చాలా చెప్పాం. ఈ మూవీలో మన వైల్డ్ లైఫ్ గురించి మనకు ఎంతో అద్భుతంగా చెప్పబోతోన్నారు. మన కల్చర్, మన నేచర్‌ను మనమే కాపాడుకోవాలి. శ్రీకాంత్‌కు పెద్ద విజయం దక్కాలి. ఈ ప్రాజెక్ట్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. మణిశర్మ గారు ఈ ప్రాజెక్ట్‌కి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్‌లకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ .. ‘శ్రీకాంత్ 2014లో ఈ వైల్డ్ లైఫ్ జర్నీని ప్రారంభించారు. శ్రీకాంత్ తీసిన డాక్యుమెంటరీని నాకు చూపించారు. అదంతా ఏపీలో తీసింది అని చెప్పడంతో షాక్ అయ్యాను. నేను ఓ సారి అడవిలో వైల్డ్ లైఫ్‌ను అనుభవించి వచ్చాక రీఫ్రెష్, రీసెట్ ఫీల్ అయ్యాను. కానీ మనం ఈ సమాజంలో మాత్రం పక్క జీవుల్ని హింసిస్తూ బతికేస్తున్నాం. మన ఆంధ్రలో ఉన్న వైల్డ్ లైఫ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలని శ్రీకాంత్ కంకణం కట్టుకున్నాడు. ఈ ప్రయాణంలో నాకు వీలైనంతగా శ్రీకాంత్‌కు సపోర్ట్ చేశాను. అప్పుడే మా బావ సాయి దుర్గ తేజ్‌ను కలిశాను. ఆ విజువల్స్ చూసి సాయి దుర్గ తేజ్ మాకు థాంక్స్ చెప్పారు. ఆంధ్రలోని వైల్డ్ లైఫ్‌ను బయటకు తీసుకు రావాలని అనుకుంటున్నట్టుగా తేజ్ చెప్పారు. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించి కావాల్సిన సహాయ సహకారాలన్ని అందేలా చేశారు. తెలుగు జాతి గర్వపడేలా మన ఆంధ్రలోని అద్భుతాల్ని చూపించాలని శ్రీకాంత్ ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడ్డారు. 72 నిమిషాల నిడివితో అద్భుతమైన డాక్యుమెంటరీని శ్రీకాంత్ చూపించబోతోన్నారు. మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని డాక్యుమెంటరీ చూసిన తరువాత అందరూ ఆశ్చర్యపోతారు’ అని అన్నారు.

See also  క్యాట్ ఫస్ట్ కాపీ రెడీ

శ్రీకాంత్ మన్నెపూరి మాట్లాడుతూ .. ‘నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత వైల్డ్ లైఫ్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేశాను. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ప్లేస్ గురించి చెప్పారు. కానీ మన తెలుగు రాష్ట్రాల గురించి ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో వాలంటీర్‌గా చేసిన తరువాత నాకు చాలా విషయాలు తెలిశాయి. మన ఆంధ్రలోనే ఎన్నో అద్భుతాలున్నాయి. మన దగ్గర ఉన్న వాటి గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. వైల్డ్ లైఫ్ అంటే ఆంధ్ర అనేది గుర్తుకు రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు కేవలం టైటిల్, గ్లింప్స్ మాత్రమే చూపించాం. త్వరలోనే ట్రైలర్‌తో అందరినీ కట్టి పడేస్తాం. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, నవదీప్ గారికి, సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. మ్యూజిక్ ఇచ్చి సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థాంక్స్’ అని అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.