Skip to content

రామ్ చరణ్ ‘పెద్ది’ పోరాట సన్నివేశాల చిత్రీకరణ

రామ్ చరణ్ ‘పెద్ది’ పోరాట సన్నివేశాల చిత్రీకరణ Telugu News

రామ్ చరణ్ ‘పెద్ది’ పోరాట సన్నివేశాల చిత్రీకరణ

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కు, ‘చికిరి’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి అందరికీ తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ‘పెద్ది’ని భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ‘పెద్ది’ బృందం రామ్ చరణ్, ఇతర ఫైటర్లతో పాటు కీలకమైన, హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ఈ షూటింగ్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ ఈ భారీ యాక్షన్ బ్లాక్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌ కానుందని, అందుకే మేకర్స్ షామ్ కౌశల్‌ను సంప్రదించారు. ఈ సీక్వెన్స్‌కు సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ చిత్రీకరణను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా పర్ఫెక్షనిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ప్రతి యాక్షన్ సెగ్మెంట్ పైనా చాలా శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా రూపొందిస్తున్నారు.

ఇక ఇప్పటికే ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మార్కును దాటి వరల్డ్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. అంతే కాకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చార్ట్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ‘పెద్ది’ కోసం అకాడమీ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

‘పెద్ది’ చిత్రాన్ని మార్చి 27, 2026న గ్రాండ్‌గా పాన్-ఇండియా వైడ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

See also  రెండో రోజూ దూసుకెళ్తున్న ‘పెద్ది’, రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్

తారాగణం : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: వృద్ధి సినిమాస్
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.