Skip to content

రెండో రోజూ దూసుకెళ్తున్న ‘పెద్ది’, రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్

రెండో రోజూ దూసుకెళ్తున్న ‘పెద్ది’, రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రేక్షకుల నుంచి వస్తున్న యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో అద్భుతంగా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన రివ్యూలు, బలమైన మౌత్ పబ్లిసిటీని సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’, రెండో రోజూ అదే జోరును కొనసాగించింది.

రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.44 కోట్ల గ్రాస్‌ను రాబట్టి, రెండు రోజుల మొత్తం వసూళ్ల రూ.181.8 కోట్లకు చేరింది. విశేషమేమిటంటే, రెండో రోజు వసూళ్లే పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల తొలి రోజు కలెక్షన్లను మించి ఉండటం ఈ సినిమా బాక్సాఫీస్ సత్తాను చాటుతోంది.

నార్త్ ఇండియాలో రెండో రోజు నుంచి గణనీయంగా పెరగడం విశేషం. సినిమాపై వస్తున్న పాజిటివ్ టాక్ వేగంగా వ్యాపిస్తుండటంతో హిందీ ప్రేక్షకులు కూడా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ స్పందన ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ, ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరుస్తోంది.

రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలతో కూడిన నటన అందరినీ కట్టిపడేశాయి. పలువురు ప్రేక్షకులు ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనగా అభివర్ణిస్తున్నారు.

ఓవర్సిస్ మార్కెట్‌లో కూడా ‘పెద్ది’ అద్భుతంగా. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం, ప్రస్తుతం 3 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.

వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా నమోదవుతున్నాయి. చాలా కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండగా, అనేక ప్రాంతాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. బలమైన మౌత్ పబ్లిసిటీ, భారీ అడ్వాన్స్ బుకింగ్స్, ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో రాబోయే రోజుల్లో ‘పెద్ది’ మరింత సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.