Skip to content

పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా “సోగ్గాడు” స్వర్ణోత్సవ కార్యక్రమం

నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా…

Read more

ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్తానం

'సోగ్గాడు' స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మురళీమోహన్ నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, "నాకు తొలి అవకాశం ఇచ్చింది…

Read more

స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న ‘సోగ్గాడు’

నటభూషణ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత 'సోగ్గాడు' శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ నాయకానాయికలుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం నాటి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్…

Read more

క్రమశిక్షణే ఎవరికైనా “లక్ష్మణరేఖ”

"లక్ష్మణరేఖ" గోల్డెన్ జూబిలీ వేడుకలో మురళీ మోహన్ - జయసుధ గోపాలకృష్ణ దర్శకత్వంలో మురళీమోహన్ - జయసుధ జంటగా నటించిన "లక్ష్మణ రేఖ" చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసిన రాజేంద్రప్రసాద్ లను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావాలను లక్ష్మణరేఖలుగా మలచుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు రామసత్యనారాయణను అభినందించారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం, పి.ఎన్. రామచంద్రరావు, తెలుగు…

Read more

అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను – నందమూరి బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ…

Read more