కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా #KA13 ‘బిహైండ్-ది-సీన్స్’ (BTS) వీడియో రిలీజ్
'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి 'జాయ్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మాతగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ "Ek Dum Bindass Pakaane Waale" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే అందరి దృష్టిని…
