“శంబాల” మూవీ టీమ్ కు కాన్ఫిడెన్స్ ఇస్తూ, బెస్ట్ విశెస్ అందించిన కిరణ్ అబ్బవరం
ఆదిసాయికుమార్ హీరోగా నటించిన శంబాల సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తోంది. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన స్పీచ్ శంబాల టీమ్ లో మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. ఆది ఫాదర్ సాయికుమార్ తో తనకున్న అనుబంధాన్ని ఈ వేదిక మీద గుర్తుచేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - శంబాల మూవీ గురించి ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా చెబుతున్నారు. ఆది అన్నకు ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలి. నాకు ఇండస్ట్రీలో తెలిసిన పెద్ద హీరో సాయికుమార్ గారే. ఆయన నా ఎస్ ఆర్ కల్యాణమండపం…
