G.O.A.T సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది: నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి
జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో... క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ G.O.A.T . ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. తమిల్ లో నాకు బ్యాచిలర్ ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో తెలుగులో G.O.A.T సినిమా అంతా పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. కథ విన్నప్పుడు ఫుల్ కామెడీ నవ్వుతూనే ఉన్నాను…
