‘షోటైం’ మూవీ జూలై 4న గ్రాండ్ రిలీజ్
అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. నవీన్ చంద్ర హీరోగా మీనాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు. ఈ మేరకు హీరో అడవి శేషు చేతుల మీదుగా షో టైమ్ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుడిని థియేటర్లో కట్టిపడేసి, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసే అద్భుతమైన కంటెంట్ షో…