రూ.వంద కోట్ల గ్రాసర్ గా “మిరాయ్”
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ "మిరాయ్" చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. "మిరాయ్" పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. తాజాగా ఈ మూవీ వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. "మిరాయ్" ఘన విజయం నేపథ్యంలో మంచు మనోజ్ కు శుభాకాంక్షలు చెప్పింది ఆయన నెక్ట్స్ మూవీ "డేవిడ్ రెడ్డి" టీమ్. మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ గా నటించిన "మిరాయ్" సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరినందుకు కంగ్రాట్స్ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు "డేవిడ్ రెడ్డి" టీమ్. వెల్వెట్ సోల్ మోషన్…
