‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ‘మంగ’ ఫస్ట్ లుక్ రిలీజ్
‘RX 100’, ‘మంగళవారం’ చిత్రాలలో ప్రశంసలు పొందిన దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’ కు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, జయ కృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె, ‘ఉయ్ అమ్మ’ పాటతో గుర్తింపు పొందిన రాషా థడానీ కూడా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. సక్సెస్ ఫుల్ నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్ పై నిర్మాత పి కిరణ్ దీనిని నిర్మిస్తున్నారు. టైటిల్ రివిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్…
