Skip to content

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ‘మంగ’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి  ‘మంగ’  ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘RX 100’, ‘మంగళవారం’ చిత్రాలలో ప్రశంసలు పొందిన దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’ కు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, జయ కృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె, ‘ఉయ్ అమ్మ’ పాటతో గుర్తింపు పొందిన రాషా థడానీ కూడా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. సక్సెస్ ఫుల్ నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్ పై నిర్మాత పి కిరణ్ దీనిని నిర్మిస్తున్నారు. టైటిల్ రివిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు, ఈ చిత్రం నుంచి రాషా థడానీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు, ఇందులో ఆమెను ‘మంగ’ పాత్రలో పరిచయం చేశారు. సాంప్రదాయ దుస్తులలో రాషా అద్భుతంగా కనిపిస్తోంది, హుందాతనం, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్‌లో ఆమె ఆకట్టుకునే లుక్స్ ఇప్పటికే ప్రేక్షకులు, సినీ వర్గాలని అలరించాయి.

ఈ చిత్రం ఇటీవల 30 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌లోకి ఎంటర్రైయింది. ఉన్నత నిర్మాణ విలువలు, క్రియేటివ్ విజన్ తో టీం వేగంగా ముందుకు సాగుతోంది.

మహేష్ బాబుతో సహా తెలుగు చిత్రసీమలో అనేక పెద్ద స్టార్స్ ని పరిచయం చేసి, కృష్ణతో కూడా ఒక సినిమా నిర్మించిన అశ్విని దత్, ఇప్పుడు మరో కొత్త జయ కృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్నారు.

ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, జయకృష్ణ ఐఎస్‌సి డీవోపీగా పని చేస్తున్నారు. మాధవ్ కుమార్ గుల్లపల్లి ఎడిటర్, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్. రియల్ సతీష్ యాక్షన్ కోరియోగ్రఫీ చేస్తున్నారు.

పవర్ ఫుల్ డైరెక్టర్, ట్యాలెంటెడ్ డెబ్యూ స్టార్స్, మంచి సంగీతం, ఆసక్తికరమైన నేపథ్యంతో ‘శ్రీనివాస మంగాపురం’ ముందుకు వస్తోంది. ఈ చిత్రం జయ కృష్ణ ఘట్టమనేని, రాషా థడానిలకు మైల్ స్టోన్ గా నిలవడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు మేకర్స్ తెలియజేస్తారు.

నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రషా థడానీ

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.