ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !!
"మా ఊరి ప్రేమకథ' చిత్రంతో హీరోగా పరిచయం అయిన మంజునాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చు కోవాలని .. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. 'రౌడీ విక్రమ్', 'పక్కా ప్రేమికుడు', చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.. హీరో మంజునాథ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (S L V) పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ మంజునాథ్ హీరోగా వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం ఫిబ్రవరి 19న హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూ ర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా…
