Skip to content

ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !!

ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !! Telugu News
ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !! Telugu News
ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !! Telugu News

“మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో  హీరోగా పరిచయం అయిన మంజునాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చు కోవాలని .. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’, చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.. హీరో  మంజునాథ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (S L V) పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ మంజునాథ్ హీరోగా వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం ఫిబ్రవరి 19న హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూ ర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి  చిత్ర దర్శకుడు అభిరామ్ గంటా గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం …                                                            హీరో మంజునాథ్ మాట్లాడుతూ.. ” నేను హీరోగా నటించిన ‘మా ఊరి ప్రేమకథ’ చిత్రం మంచి హిట్ అయి హీరోగా నాకు మంచి పేరు తెచ్చింది. వెంటనే “రౌడీ విక్రమ్” సినిమా అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో వుంది. ఇదిలా ఉండగా మరొక చిత్రం “పక్కా ప్రేమికుడు” సినిమా లో కూడా హీరోగా చేస్తున్నాను. ఈ చిత్రం తొంబై శాతం కంప్లీట్ అయింది. ఈ రెండు చిత్రాలు అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే మరొక సినిమా చేసే అవకాశం వచ్చింది. అభిరాం గంటా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో నేను ప్యాషన్ డిజైనర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటెర్టైన్మెంట్ చిత్రం ఇది. ఈ చిత్రంలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మీ దేవి గారికి నా థాంక్స్ .. అన్నారు.

చిత్ర దర్శకుడు అభిరామ్ గంటా మాట్లాడుతూ.. ఫస్ట్ నేను యూట్యూబర్ ని. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేశాను. ఈ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాత లక్ష్మీ దేవి గారికి నా థాంక్స్. ఇక సినిమా విషయానికి వస్తే  లవ్, కామిడీ, సస్పెన్స్, ఏమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రం లో ఉంటాయి.. అన్నారు.

చిత్ర నిర్మాత వి. లక్ష్మీ దేవి మాట్లాడుతూ.. ”  ఈ చిత్రంలో హీరో మంజునాథ్ సరసన ప్రముఖ హీరోయిన్ కథా నాయికగా  నటించనుంది. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ప్రముఖ  నటీ, నటులు, నటించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.. అన్నారు.

మంజునాథ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం; అభిరామ్ గంటా .. కో – ప్రొడ్యూసర్- యు గోవింద రాజులు.. పి. ఆర్. ఓ. జిల్లా సురేష్.
నిర్మాత; వి. లక్ష్మీ దేవి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.