దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్…
‘సింగ్ గీతం’ హార్ట్ టచ్చింగ్ గా ఉంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి
మహానటి తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నిర్మాత నాగ్ అశ్విన్
బిగ్గెస్ట్ మ్యూజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా సింగ్ గీతం: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు.
గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా చూశాను. చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. కానీ నాకు లోలోపల ఒక ఫీలింగ్ వచ్చింది. మనం ఒక సినిమా తీసి, చాలా కష్టపడి ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేస్తుంటాం. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ట్రైలర్ లేకుండానే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అది నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. నేనూ కూడా ట్రైలర్ లేకుండా అందంగా ప్రమోట్ చేసి సినిమా చేయాలని ఉంది. (నవ్వుతూ) కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైలర్ లాంచ్ అంటున్నారు. ఒక సినిమా రిలీజ్ అయి, మంచి టాక్ తెచ్చుకుని, సక్సెస్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం నిజంగా చాలా వింతగా, చాలా కొత్తగా ఉంది. (నవ్వుతూ) ఒక దర్శకుడు తన కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ సినిమా చేయడమే గగనం. కానీ సింగీతం గారు తీసిన ప్రతి సినిమా ఒక ల్యాండ్‌మార్క్. ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవద్వీపం… ఆయన చేసిన ప్రతి సినిమా ప్రత్యేకమైన మైలురాయి. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూడాలి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఈ టీమ్‌లో చాలా మ్యాడ్‌నెస్ ఉంది. సింగీతం గారు దాదాపు ఏడు సంవత్సరాల క్రితమే నాకు ఈ సినిమా ఆలోచన చెప్పారు. ఆయన కథ చెప్పిన తర్వాత చాలామంది నిర్మాతలను కలిశాను. కానీ అది ఎక్కడా మెటీరియలైజ్ కాలేదు. ఈ అద్భుతమైన ఆలోచన వెనుక ఎవరైనా నిలబడితే బాగుంటుందని అనిపించేది. కొన్ని సంవత్సరాల తర్వాత అది నాగ్ అశ్విన్ రూపంలో సాధ్యమైంది. సింగీతం గారి నుంచి మరో ల్యాండ్‌మార్క్ సినిమాను ప్రేక్షకులకు అందించిన నాగ్ అశ్విన్ గారికి, వైజయంతి మూవీస్‌కు హ్యాట్సాఫ్. సింగీతం గారు వెంటనే మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం వస్తే ఆయన టీమ్‌లో నేను కూడా పనిచేయాలని ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు అందించిన సంగీతానికి ప్రత్యేకంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇది ఆయన కెరీర్‌లోనే బెస్ట్ వర్క్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. టీం అందరికీ అభినందనలు
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎప్పటినుంచో ఒక మంచి మ్యూజికల్ సినిమా చేయాలని ఉండేది. మనం ఏదైనా బలంగా కోరుకుంటే యూనివర్స్ కూడా ఆ కోరికకు అనుకూలంగా పనిచేస్తుంది. అందుకే సింగ్ గీతం చేసే అవకాశం వచ్చింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఇది ఆయన 40 ఏళ్ల కల. అలాంటి కలలో మేము భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మనిషి ఆశ కూడా చాలా అందంగా ఉండాలి. చాలామంది ఆశలు కలిసి ఉంటే దేవుడు వాటిని తప్పకుండా నెరవేర్చుతాడు. ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ గారు. నిజంగా ఆయన నిర్మాత కాకపోయి ఉంటే ఈ సినిమా, ఈ వేడుక ఉండేవి కావు. సింగీతం గారు దర్శకుడిగా ఉంటే, నాగ్ అశ్విన్ గారు ఆయన కలను నిజం చేసిన వ్యక్తి. చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతాయి. మంచి డబ్బులు, పేరు తీసుకొస్తాయి. కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఒక క్రియేటర్‌కు నిజమైన సంతృప్తిని ఇస్తాయి. అలాంటి బిగ్గెస్ట్ మ్యూజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా సింగ్ గీతం. ఈ సినిమాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మమ్మల్ని ఎంతో ఇన్‌స్పైర్ చేసిన సింగీతం గారికి థాంక్యూ. 94 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉన్న ఫైర్‌కు మనందరం హ్యాట్సాఫ్ చెప్పాలి. జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన దర్శకుడు అయినప్పటికీ, ఆయన ఆలోచనల్లో, ప్యాషన్‌లో ఉన్న అగ్ని ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాకు సంబంధించిన సంగీతం విషయంలో నాకు వచ్చిన క్రెడిట్ అంతా మా గురువుగారు మండోలిన్ శ్రీనివాస్ గారికి అంకితం చేస్తున్నాను. అలాగే మా అమ్మగారికి, మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. వైజయంతి మూవీస్, అశ్వినీ దత్ గారి బ్యానర్‌లో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. రైటింగ్ టీమ్‌కు, డైరెక్షన్ టీమ్‌కు, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాతో సింగీతం గారితో పనిచేయాలనే నా కల నెరవేరింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వారి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. ఇది ఒక అందమైన జర్నీ. ఈ సినిమాను సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా కొత్తగా ఆలోచించే దర్శకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఒక కొత్త దారి చూపించిన సింగీతం గారికి నా సెల్యూట్. నాగ్ అశ్విన్ గారు సింగీతం గారి మీద చూపించిన ప్రేమ, గౌరవమే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం.
నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. సావిత్రి గారి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతం గారిని కలిశాను. మాయాబజార్ సినిమాకు పనిచేసిన ఆయన, సావిత్రి గారిని డైరెక్ట్ చేసిన దర్శకుడు, ఆదిత్య 369 తీసిన లెజెండరీ ఫిల్మ్‌మేకర్. అలాంటి ఆయనను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ అనుకున్నాను. కానీ ఆ జర్నీ ఇంతదూరం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన కలకు తెరరూపం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాను మేమెప్పుడూ తీయలేదు. ఈ సినిమా చేస్తూనే ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుని మరీ తీశాం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ గారే సంగీత దర్శకుడిగా సరైన ఎంపిక అని సింగీతం గారే చెప్పారు. ఇలాంటి సినిమా ప్రపంచంలో ఎవరూ చేయలేదని సింగీతం గారు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. కానీ సినిమా పూర్తయ్యాక అది నిజమే అనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తామే పాటలు పాడారు. అహల్య, శాలిని, అయాన్ అందరూ అద్భుతంగా కుదిరారు. నివేదా, రాహుల్ ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో ఒక సందేహం ఉంటుంది. కానీ ఒకసారి మంచి మౌత్ టాక్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఆ సినిమాను తమదిగా చేసుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ థియేటర్లకు వస్తున్నారు. మహానటి తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా ఇదే. అది సింగీతం గారి గొప్పతనం. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి నిజాయితీ తెరపై కనిపించింది. అలాంటి మ్యాజిక్‌ను ప్లాన్ చేసి చేయలేం. సింగ్ గీతంకు రెండో దర్శకుడిగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి పేరు చెప్పాలి. ప్రతి పాత్రకు ఆయన సంగీతం అద్భుతంగా కుదిరింది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాగే ఈ సినిమాకు మరో దర్శకుడు సంకల్ప్. 94 ఏళ్ల దర్శకుడు, 24 ఏళ్ల దర్శకుడు కలిసి ఒక అందమైన మ్యాజిక్‌ను సృష్టించారు.
సంకల్ప్ మాట్లాడుతూ.. ఈ సినిమా సింగీతం గారి 40 ఏళ్ల కల. ఆ కలను నెరవేర్చేందుకు నాగ్ అశ్విన్ పుట్టారేమో అనిపిస్తుంది. ఇది సింగీతం గారి కన్విక్షన్‌తో చేసిన సినిమా. కల్మషం లేని ప్రాజెక్ట్ ఇది. అందరం సింగీతం గారి కల కోసం పనిచేశాం. దేవిశ్రీ ప్రసాద్ గారితో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన సంగీతం కంపోజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండటం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
రాహుల్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా సింగీతం గారి 40 ఏళ్ల కల. అలాంటి కలకు తెరరూపం ఇచ్చిన ఈ ప్రయాణం గురించి ఒక ప్రత్యేక కథనే రాయొచ్చు. సింగీతం గారు నాకు “యాక్షన్… కట్” చెప్పారని జీవితాంతం గర్వంగా చెప్పుకుంటాను. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన సంగీతం అద్భుతం. ఆయన పాటలకు మాటలు రాశారా, మాటలకు పాటలు కట్టారా అనేది కూడా అర్థం కాలేదు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సింగీతం గారికి, నాగ్ అశ్విన్ గారికి థాంక్యూ. నేను సినిమా చూశాను. నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ప్రపంచంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా ఆకట్టుకునేలా చూపించారు. ఇలాంటి మ్యూజికల్ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సింగీతం గారు డైరెక్టర్స్ డైరెక్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైజయంతి మూవీస్‌కు ధన్యవాదాలు.
హీరోయిన్ అహల్య మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇకపై రావడం కూడా చాలా కష్టం. ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. అందరికీ థాంక్యూ.
హీరో అయాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. అయితే అందరిలోకీ నేను మరింత అదృష్టవంతుడిని. వైజయంతి మూవీస్ ఒక మహావృక్షం లాంటిది. ఆ చెట్టు నీడలో మేమందరం ఉండటం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సింగీతం గారికి, నాగ్ అశ్విన్ గారికి, వైజయంతి మూవీస్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.
హీరోయిన్ శాలిని మాట్లాడుతూ.. ఈ సినిమా మీరు చూడకపోతే చాలా గొప్ప అనుభూతిని మిస్ అయినట్టే. మీ మంచి కోసమే చెబుతున్నాను. తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూడండి. ఈ సినిమాను మిస్ అవ్వకండి.
యాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్లుగా నేను సినీ పరిశ్రమలో ఉన్నాను. కానీ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నటించలేదనే ఒక లోటు ఉండేది. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు.
యాక్టర్ శివన్నారాయణ మాట్లాడుతూ..తెలుగులో ఇలాంటి మ్యూజికల్ ఫిల్మ్ రావడం నిజంగా మన అదృష్టం. ఒకప్పుడు నటులే తమ పాత్రలకు తామే పాటలు పాడుకునేవారు. నాగేశ్వరరావు గారు కూడా తన పాత్రలకు ఆయనే పాడుకునేవారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నటీనటులందరితో పాటలు పాడించిన సినిమాను తీసిన సింగీతం గారికి, నాగ్ అశ్విన్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలను నిర్మించడం వైజయంతి మూవీస్‌కే సాధ్యమైంది. ఇప్పటికీ వైజయంతి మూవీస్ గోల్డెన్ హ్యాండ్స్‌లోనే ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ సంస్థ ఇప్పుడు ఒక అద్భుతమైన మ్యూజికల్ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇలాంటి సినిమాలో భాగం కావడం మా అదృష్టం. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

