‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి అదిరిపోయే స్టిల్
మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంఅద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా నుంచి రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొత్త స్టిల్ అదిరిపోయింది. బ్లాక్ సూట్, వైట్ షర్ట్, కళ్లకు డార్క్ గ్లాసెస్ తో ఒక చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా…
