Skip to content

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి, జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి, జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ Telugu News

మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి, ప్రేక్షకుల రష్ ని గరిష్ఠంగా పెంచుతుందని భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్ గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. రెడ్ కార్ పై బ్లాక్ సూట్ లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్ తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి.

చిరంజీవి, అనిల్ రావిపూడిల కలయికే ఇప్పటికే చాలా ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సంచలనం సృష్టించాయి. వెంకటేష్ ప్రత్యేక పాత్ర తోడవడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన తారాగణం ఉండటంతో అంచనాలు గణనీయంగా పెరిగాయి.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సంయుక్తంగా రాశారు.

మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మరింత జోరుగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు – సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ – శ్రీమతి అర్చన
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
డీవోపీ – సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ – తమ్మిరాజు
రచయితలు – ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.