*సోషియోఫాంటసీగా “దీర్ఘాయుష్మాన్ భవ”*
ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ ప్రేమకథతో సినిమాగా "దీర్ఘాయుష్మాన్ భవ" చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లు. ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ కథాశంతో రెండున్నర గంటలపాటు ప్రీక్షకులను అలరింపజేసే వినోదంతో ఈ చిత్రాన్ని మలచడం జరిగిందని ఆయన చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చాం. ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుందని అన్నారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు. …