మే 1న ‘లెనిన్’ విడుదల
అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమవారం రోజున ‘వారెవా వారెవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేవారు. ఈ పాటకు అభిమానులు, మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట…
