ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది : నారా చంద్రబాబు నాయుడు గారు
ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు గండిపేటలో ఘనంగా జరిగాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ అభినందనలు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. గండిపేటకు వస్తే నాకు చాలా జ్ఞాపకాల గుర్తుకొస్తాయి. గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన తర్వాత, నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పని చేశాను. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన…
