Skip to content

‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ విడుదలైంది. 'ఫంకీ' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ‘ధీరే ధీరే’కి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం. వినసొంపుగా ఉన్న ఈ ‘ధీరే ధీరే’ మెలోడి, వినగానే…

Read more

జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం.” -నవీన్‌ పొలిశెట్టి

2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాలలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం 'భీమవరం బల్మా' తాజాగా విడుదలైంది. 'భీమవరం బల్మా' గీతావిష్కరణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. యువత కోలాహలం నడుమ…

Read more

‘ఫంకీ’ 2026 ఏప్రిల్ 3న విడుదల

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'ఫంకీ' ఏప్రిల్ 3, 2026న విడుదల వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ వచ్చేసింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న 'ఫంకీ' చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినోదభరిత…

Read more

మాస్ అంశాలతో కూడిన వినూత్న చిత్రం ‘మాస్ జాతర’ : దర్శకుడు భాను భోగవరపు

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మాస్ జాతర' చిత్రం కోసం మాస్ మహారాజా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొంది.. భారీ అంచనాలు…

Read more