ప్రధాన మంత్రి మోదీని కలిసి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) చైర్మన్ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విరేందర్ సచ్దేవా కలిసి ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా, APL తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రతినిధులు ప్రధాన మంత్రికి ఒక సింబాలిక్ బౌ ని అందజేశారు. అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయిన విలువిద్యను (Archery) తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో సాగుతోంది. ప్రపంచ స్థాయి శిక్షణ, పోటీ వేదికలు, అంతర్జాతీయ గుర్తింపు ..ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యాకారులకు…
