Skip to content

సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” నుంచి హీరో ఉన్ని ముకుందన్ బర్త్ డే విశెస్ పోస్టర్ రిలీజ్

సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” నుంచి హీరో ఉన్ని ముకుందన్ బర్త్ డే విశెస్ పోస్టర్ రిలీజ్ Telugu News

అసమాన ప్రజానేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను “మా వందే” టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ఈ రోజు హీరో ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తన నట ప్రతిభతో ప్రధాని మోదీ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు హీరో ఉన్ని ముకుందన్.

ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే “మా వందే” చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మాణవుతోంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం “మా వందే” చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.

నటీనటులు – ఉన్ని ముకుందన్, తదితరులు

టెక్నికల్ టీమ్
————————
యాక్షన్ – కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – సాబు సిరిల్
ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్
డీవోపీ – కె.కె. సెంథిల్ కుమార్
మ్యూజిక్ – రవి బస్రుర్
బ్యానర్ – సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – గంధాధర్ ఎన్ఎస్, వాణిశ్రీ .బి.
లైన్ ప్రొడ్యూసర్ – టీవీఎన్ రాజేశ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ – వాల్స్ అండ్ ట్రెండ్స్
నిర్మాత – వీర్ రెడ్డి.ఎం.
రచన, దర్శకత్వం – క్రాంతికుమార్.సి.హెచ్.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.