‘నేను రెడీ’ టీజర్ రిలీజ్
యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. ఈ టీజర్ ఒక ఎంటర్టైనింగ్ కథాంశాన్ని పరిచయం చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధ్యత గల మధ్యతరగతి ఆంధ్ర యువకుడికి, ఒక మధ్యతరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, దానివల్ల కల్చర్, లైఫ్ స్టయిల్ మధ్య…
