Skip to content

‘నేను రెడీ’ షూటింగ్ పూర్తి

‘నేను రెడీ’ షూటింగ్ పూర్తి Telugu News
‘నేను రెడీ’ షూటింగ్ పూర్తి Telugu News

యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి చేస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్ తో ఇప్పటికే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. నిన్న రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ షూట్ చేశారు. ఈరోజుతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

ఈ సినిమా త్రినాధ రావు నక్కిన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ” నేను రెడీ ” ని సిద్ధం చేస్తున్నారు.

హీరో హవిష్ కెరీర్ లో నేను రెడీ అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గా ఉండబోతోంది. షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ వంటి ప్రముఖ తారాగణం ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధంగా వున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్టార్ కాస్ట్ వున్న సినిమా ‘నేను రెడీ’ కావడం విశేషం.

స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. నిజార్ షఫీ డీవోపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్

See also  ది ప్యారడైజ్ నుంచి 'ఆయా షేర్' సాంగ్ రిలీజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.