Skip to content

“స్వయంభు”, “నాగబంధం”తో ప్రేక్షకుల ముందుకొస్తున్న నభా నటేష్

“స్వయంభు”, “నాగబంధం”తో ప్రేక్షకుల ముందుకొస్తున్న  నభా నటేష్ Telugu News
“స్వయంభు”, “నాగబంధం”తో ప్రేక్షకుల ముందుకొస్తున్న  నభా నటేష్ Telugu News

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. నాగబంధం చిత్రంలో పార్వతి క్యారెక్టర్ లో, స్వయంభు చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలతో ఆమె సాలిడ్ లైనప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వయంభు, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియెన్స్ కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్ గా మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ రెండు చిత్రాల విజయాల పట్ల, తన క్యారెక్టర్స్ కు రాబోయే రెస్పాన్స్ పట్ల నభా నటేష్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పటికే స్వయంభు, నాగబంధం చిత్రాల టీజర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇలా ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు సమ్మర్ రిలీజ్ కు వస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

See also  "K-ర్యాంప్" మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది, మీకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నా - 'ర్యాంప్ మీట్'లో సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.