‘వార్ 2’ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
వరుస విజయాలతో దూసుకుపోతూ వైవిధ్యమైన సినిమాలను రూపొందిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహిస్తోంది. హ్యాట్రిక్ విజయాల కోసం ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, దేవర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘వార్ 2’ కోసం కలిసి పని చేస్తోంది. YRF బ్లాక్ బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయటానికి సిద్ధమైంది…