Skip to content

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఈ సంస్థకి , ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు. – ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన!

ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా…

Read more

‘లెనిన్’ చిత్రానికి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక ట్రైలర్‌కి నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా చిత్రయూనిట్ మరో సర్ ప్రైజ్‌తో అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పె ంచింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘లెనిన్’ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా కథను, నేపథ్యాన్ని, శ్రీరామపురం గురించి ఎన్టీఆర్ తన గంభీరమైన…

Read more

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు టిడి జనార్దన్ కు అందించడం సముచితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు హైదరాబాదులోని త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో మరో భారీ చిత్రం.. దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం!

విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో…

Read more
విరాళాలపై అప్రమత్తంగా ఉండాలి Telugu News

విరాళాలపై అప్రమత్తంగా ఉండాలి

‘‘కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్‌ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌ కు సంబంధం లేదు. వీటిని ఆయన ఏ విధంగానూ ఆమోదించడం లేదని అధికారికంగా స్పష్టం చేస్తున్నాం. ఎన్టీఆర్‌, ఆయన ఆఫీస్‌తో సంబంధం ఉన్నట్లుగా చెబుతూ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను కోరుతున్నాం. ఎలాంటి ప్రకటనలైనా, సామాజిక కార్యక్రమాలైనా.. వాటి వివరాలు నేరుగా ఎన్టీఆర్‌ నుంచే వెల్లడి అవుతాయి. మీ సహకారానికి, నిరంతర అభిమానానికి ధన్యవాదాలు ’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Read more
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల Telugu News

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ‘మృత్యుంజయ్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ని పలకరించనున్నారు. ‘మృత్యుంజయ్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటకి కూడా యూట్యూబ్‌లో ఆదరణ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్…

Read more
ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు Telugu News

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ మాధ్య‌మాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిష‌న్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన‌ ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాల‌ను జారీ చేసింది. ఆదేశాల మేర‌కు ఎన్‌టీఆర్ గారి పేరు గానీ, “ఎన్‌టీఆర్”, “జూనియర్ ఎన్‌టీఆర్”, “తారక్” లాంటి పేర్లు గానీ, “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప‌రంగా వాడితే చ‌ట్ట…

Read more
0b7bd3da-11b9-41c4-923c-709ee0edc503

కాంతార: చాప్టర్ 1 ఇండియన్ సినిమాలో బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్

కాంతార: చాప్టర్ 1 సినిమాని తప్పకుండా అక్టోబర్ 2న అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను: హీరో దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్…

Read more
వార్ 2’ కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లకు హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్ Telugu News

వార్ 2’ కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లకు హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

ఇండియన్ ఐకానిక్ స్టార్‌లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు రిక్వెస్ట్‌ చేశారు. ‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని…

Read more
‘వార్ 2’ నుంచి ‘సలామే అనాలి’ గ్లింప్స్ విడుదల Telugu News

‘వార్ 2’ నుంచి ‘సలామే అనాలి’ గ్లింప్స్ విడుదల

YRF నిర్మాణంలో ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను అద్భుతంగా చూపిస్తూ అయాన్ ముఖర్జీ తీసిన ‘వార్ 2’ ఆగస్ట్ 14న థియేటర్లోకి రానుంది. ఇప్పటి వరకు ‘వార్ 2’ నుంచి వదిలిన కంటెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వార్ 2 టీజర్, గ్లింప్స్, రొమాంటిక్ సాంగ్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ‘వార్ 2’ మీద మరింత హైప్ పెంచేసింది చిత్రయూనిట్. ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులు నుంచి ఈ పాట గురించి సోషల్…

Read more