Skip to content

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది. -దగ్గుబాటి పురందేశ్వరి

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు గారు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని డిసెంబర్ 13 హైదరాబాద్ FNCC లో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్న శ్రీమతి పురందేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన జరిగింది. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయ…

Read more

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి మోహనకృష్ణ, నందమూరి రూప

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూపా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు చేతుల మీదగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గం లో మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ప్రతిష్టించడం…

Read more

ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాత్ర

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్‌ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. ధర్మపరుడిగా, బలవంతుడిగా మరియు ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను…

Read more