‘పురుష:’ నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ఓ సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లడం, చిత్రం విడుదలకు ముందే హైప్ పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ ‘పురుష:’ టీం మాత్రం కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు, ట్యాగ్ లైన్స్, ఇంట్రడక్షన్ పోస్టర్లతోనే అందరినీ ఆకట్టుకుంటున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్…
