Skip to content

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సోమవారం ఎస్ కేఎన్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. తాజాగా ప్రభాస్ ను రాజా సాబ్ సెట్ లో కలిశారు ఎస్ కేఎన్. ప్రభాస్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఎస్ కేఎన్. ఈ ఫొటోలో ప్రభాస్ న్యూ స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెబుతున్నారు. రాజా సాబ్ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్నారు ఎస్ కేఎన్. డిసెంబర్ 5న రాజా సాబ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Read more

‘కన్నప్ప’లో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా ఉంటాయి : శివ బాలాజీ

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. * ‘కన్నప్ప’ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు అని విష్ణుని మోహన్ బాబు గారు అడిగారు. శివ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదు అని విష్ణు అన్నారు. లేదు…

Read more

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న వాసరా ఎంటర్‌టైన్‌మెంట్.. థియేటర్ల జాబితా విడుదల, బుకింగ్స్ షురూ

విజువల్ వండర్‌గా, భక్తిని పెంపొందించేలా ‘కన్నప్ప’ చిత్రాన్ని డా. ఎం మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మించారు. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ తన విజన్‌ను జోడించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద తెరకెక్కించిన ఈ సినిమాను జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్ కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఆల్రెడీ ట్రైలర్, టీజర్లు, పాటలు, పోస్టర్లు జనాల్లోకి వెళ్లాయి. ఓవర్సీస్ ఆడియెన్స్‌ కోసం ఈ చిత్రాన్ని వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తోంది. థియేటర్ల జాబితా విడుదల కావడం, బుకింగ్‌లు ఓపెన్ అవ్వడంతో అక్కడ కన్నప్ప ట్రెండ్ అవుతోంది. ఇక…

Read more