Skip to content

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న వాసరా ఎంటర్‌టైన్‌మెంట్.. థియేటర్ల జాబితా విడుదల, బుకింగ్స్ షురూ

Ksnnapps1
Ksnnapps1

విజువల్ వండర్‌గా, భక్తిని పెంపొందించేలా ‘కన్నప్ప’ చిత్రాన్ని డా. ఎం మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మించారు. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ తన విజన్‌ను జోడించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద తెరకెక్కించిన ఈ సినిమాను జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్ కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఆల్రెడీ ట్రైలర్, టీజర్లు, పాటలు, పోస్టర్లు జనాల్లోకి వెళ్లాయి.

ఓవర్సీస్ ఆడియెన్స్‌ కోసం ఈ చిత్రాన్ని వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తోంది. థియేటర్ల జాబితా విడుదల కావడం, బుకింగ్‌లు ఓపెన్ అవ్వడంతో అక్కడ కన్నప్ప ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విష్ణుకి జోడిగా ప్రీతి ముకుందన్ నటించారు.

ఈ కాలాతీత కథను విజువల్ వండర్‌గా మేకర్లు సృష్టించారు. ఆధునిక సాంకేతికతను వాడుకుని గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పని రూపొందించారు. ఓవర్సీస్‌లో జూన్ 26న, ఇండియాలో జూన్ 27న కన్నప్ప భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.